Nimmala Ramanayudu: పోలవరం ప్రాజెక్టు పై నిమ్మల ఆవేదన...! 1 y ago
AP : పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు కుదిస్తూ కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ రాసిందని పేర్కొన్నారు. ఫేజ్ - 1, ఫేజ్ -2గా విభజించి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది వైసీపీనే అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ పోలవరం పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేశారన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేసి సర్వ నాశనం చేశారన్నారు. 2025 నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి నీరందిస్తామని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో 45.72 మీటర్ల ఎత్తుకే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామన్నారు.